సూర్యపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుందా?     2018-05-01   00:32:38  IST  Raghu V

అల్లు అర్జున్‌ హీరోగా, అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. భారీ అంచనాలున్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించాడు. రచయితగా ఎన్నో సూపర్‌ హిట్స్‌ను అందుకున్న ఈయన మొదటి సారి దర్శకత్వం చేశాడు. మరి ఈ చిత్రం ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి అంటే విడుదల వరకు ఆగాలి. ఇక ఈ చిత్రం విడుదల విషయమై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. పెద్ద సినిమాలకు ఇటీవల ఏపీలో ఉదయం ఆటలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. కాని ఈ చిత్రానికి ఇస్తారా లేదా అనే విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవల మెగా ఫ్యామిలీ మొత్తం టీడీపీకి పూర్తి వ్యతిరేకం అయ్యింది. పవన్‌ కళ్యాణ్‌ టీడీపీ నాయకులపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో అభ్యంతరక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు మెగా ఫ్యామిలీ అంతా కూడా మద్దతు పలికింది. పవన్‌పై జరిగిన మీడియా దాడిని మెగా ఫ్యామిలీ ఖండివ్వడంతో వివాదం పెద్దదైంది. మెగా ఫ్యామిలీ అంతా కూడా ఏపీ ప్రభుత్వం అంటే తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకం అయినట్లే. ఈ కారణంగానే ‘నా పేరు సూర్య’ చిత్రాన్ని ఏపీలో బెన్‌ఫిట్‌ షో వేయడం కష్టం అయ్యే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు.