“ఎన్నారై” లకి ఏపీ ప్రభుత్వం “భీమా భరోసా”     2018-04-18   04:22:53  IST  Bhanu C

చదువుల కోసమో , ఉద్యోగాల కోసమే ,లేక అ ఏదైనా వ్రుత్తి కోసమే ఎంతో మంది ఏపీ నుంచీ తెలుగు ప్రజలు ఎన్నో దేశ విదేశాలకి తరలి వెళ్తూ ఉంటారు..తమ భార్యా బిడ్డలని ,తల్లి తండ్రులని, వదిలి మరీ జీవనం కోసం తరలి పోతూ ఉంటారు ముఖ్యంగా ఎంతో మంది ఏపీ నుంచీ కువైట్ ,దుబాయ్ వంటి దూర దేశాలకి ఎంతో మంది పేద కుటుంబాలు వెళ్తూ ఉంటాయి..అయితే ఇలా వెళ్ళే వారికోసం బీమా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్స్‌ తెలుగుసొసైటీ సహకారంతో సెర్ప్‌ ఆధ్వర్యంలో భీమా పథకాన్ని అమలుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. చంద్రన్న బీమా తరహాలో ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఒకసారి బీమా ప్రీమియం చెల్లిస్తే, మూడేళ్ల దాకా ఈ పథక లబ్ధిని పొందవచ్చు. దీనికోసం లబ్ధిదారులు కట్టాల్సింది కేవలం రూ. 150. రూపాయలు మాత్రమే ప్రవాసాంధ్ర ఉద్యోగులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.