బాబు అంటేనే వణికి పోతున్న సీనియర్స్    2017-10-26   04:12:54  IST 

సీనియర్ నాయకులకి తెలుగుదేశం పార్టీలో మూడినట్టే కనిపిస్తోంది తెలుగుదేశం లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తూ ఉంటే.. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచీ ఇప్పటివరకు ఉన్న సీనియర్స్ ని బాబు దూరం పెడుతున్నాడట.. పార్టీకోసం ఎంతో అంకిత‌భావంతో ఉన్న ఓ సీనియ‌ర్ లీడ‌ర్‌, మాజీ మంత్రిని చంద్ర‌బాబు సైడ్ చేసేస్తున్నారు. అలాంటి వ్య‌క్తుల్లో రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌రి ఒక‌రు. రాజ‌మండ్రి సిటీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లో రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు.