కాపు ఒట్లకోసమే కన్నా..అసలు అధ్యక్షుడు ఎవరంటే..?     2018-06-30   23:53:48  IST  Bhanu C

ఏపీ బీజేపీ కి అధ్యక్షుడు ఎవరు..? ఏమిటి ఈ వింత ప్రశ్న సరే కన్నా లక్ష్మీ నారాయణ ఇదే కదా అందరికీ తెలిసిన విషయం అయితే ఏపీ బీజీపీ కి కన్నా కాకుండా మరొక అధ్యక్షుడు కూడా ఉన్నాడండోయ్ కన్నా అధికారికంగా అయితే ఈ షాడో అధ్యక్షుడు మాత్రం రియల్ అద్యక్షుడు కంటే కూడా తెగ హడావిడి చేస్తూ ఉంటాడు..సరే ఇప్పటికే మీకు ఒక అంచనా వచ్చేసి ఉంటుంది కదా అతనెవరో కాదంటే సోము వీర్రాజు..పాపం ఏపీ బీజేపి పగ్గాలి చేతికి వస్తాయని వేచి చూసిన సోము కి ఘలక్ ఇచ్చిన అధిష్టానం ఆ ప్లేస్ లో కన్నా ని కూర్చోపెట్టింది..అయితే అసలు ఏపీలో అధికార పక్షాన్ని బీజేపి తరుపున దుమ్మెత్తి పోయాలి చీల్చి చెండాడాలి అంటే ముందుగా అధ్యక్షుల వారు ఉంటారు..కానీ

ఏపీలో అధికార‌ప‌క్షాన్ని ఇరుకున పెట్ట‌డంలో ఎవ‌రు ముందున్నారు..ఎవ‌రు చంద్ర‌బాబుకు కౌంట‌ర్ ఇస్తున్నారు..ఎవ‌రు ఎక్కువ‌గా అధికార పార్టీపై విరుచుకుప‌డుతున్నారు..అసలు ఏపీ బీజేపి పేరు చెప్తే గుర్తుకు వచ్చేది ఎవరు అంటే సోము వీర్రాజు అంటూ చటుక్కున చెప్పేయచ్చు..అయితే కన్నా ఎంట్రీ తో కొంతకాలం సైలెంట్ అయిన సోము మళ్ళీ సీన్ లోకి ఎంటర్ అయ్యారు ఎందుకంటే క‌న్నా.. ఆశించిన మేర‌కు పార్టీని న‌డిపించ‌క‌పోవ‌డమే అంటున్నారు..కన్నా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌పై ఆయ‌న విమ‌ర్శ‌లు చేయ‌డంలో చాలా వెనుక‌బ‌డిపోయారు. ముఖ్యంగా బీజేపీ.. వైసీపీతో రాసుకు పూసుకు తిరుగుతోందన్న వ్యాఖ్య‌ల‌ను కూడా ఆయన తిప్పికొట్ట‌లేక‌పోయారు.