పవన్‌తో చేసిన పాపానికి ఈ దుస్థితి     2018-05-25   01:06:22  IST  Raghu V

నాగచైతన్య హీరోగా నటించిన మజ్ను చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అను ఎమాన్యూల్‌ ఆ తర్వాత మంచి ఆఫర్లు దక్కించుకుంది. మెల్ల మెల్లగా స్టార్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే మెగా హీరో పవన్‌, అల్లు అర్జున్‌లకు జోడీగా నటించే అవకాశాలు వచ్చాయి. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. అదే ఇప్పుడు అను ఎమాన్యూల్‌ విషయంలో రుజువు అయ్యింది. ఎన్నో అంచనాలు పెట్టుకుని నటించిన అజ్ఞాతవాసి చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. పవన్‌తో నటిస్తే కెరీర్‌లో సెటిల్‌ అయ్యి పోవచ్చు అని ఆశించిన అనుకు నిరాశే మిగిలింది.

అజ్ఞాతవాసి సక్సెస్‌ కాకపోయినా కూడా ఆమెపై నమ్మకంతో, ఆమె అందంకు ముగ్దుడు అయిన దర్శకుడు వక్కంతం వంశీ తన నా పేరు సూర్య చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా ఎంపిక చేశాడు. అల్లు అర్జున్‌ కూడా అనుపై నమ్మకం పెట్టుకుని నటించాడు. కాని నా పేరు సూర్య కూడా సర్వనాశనం అయ్యింది. ఎంతో అంచనాలు పెట్టుకున్న నా పేరు సూర్య మరియు అజ్ఞాతవాసి చిత్రాలు మినిమం సక్సెస్‌ను దక్కించుకోలేక పోవడంతో అను ఎమాన్యూల్‌ పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది. ఈమె అంతుకు ముందే కమిట్‌ అయిన సినిమాల నుండి కూడా తొలగించారు.