Another News Channel for Ysrcp

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో పార్టీల మ‌ధ్యే కాదు, మీడియాలోను అదిరిపోయే రేంజ్‌లో వార్ జ‌ర‌గ‌నుంది. మ‌న తెలుగు మీడియా పార్టీల ప‌రంగా ఎప్పుడో చీలిపోయింది. వారి ఈక్వేష‌న్ల‌ను బ‌ట్టి త‌మ‌కు న‌చ్చే పార్టీకి వారు కొమ్ము కాస్తుంటారు. మ‌న తెలుగులో రాజ‌కీయ పార్టీల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించే మీడియా సంస్థ‌లు చాలానే ఉన్నాయి. తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌కు అనుకూలంగా న‌మ‌స్తే తెలంగాణ‌, టీ న్యూస్ ఉన్నాయి. సీపీఎంకు ప్ర‌జాశ‌క్తి, న‌వ తెలంగాణ‌, 10 టీవీ ఉన్నాయి. సీపీఐకు విశాలాంధ్ర‌, 99 న్యూస్ ఉన్నాయి.

ఇక ఏపీలో అధికార టీడీపీకి కొమ్మ‌కాసే మీడియా సంస్థ‌ల‌కు లెక్కేలేదు. ఈ లిస్టులో చాలానే ఉన్నాయి. ఇక ఏపీలో విప‌క్ష వైసీపీకి సొంతంగా సాక్షి పేప‌ర్‌, సాక్షి టీవీ ఛానెల్ ఉన్నాయి. సాక్షి మీడియా సంస్థ‌ల్లో జ‌గ‌న్‌కు, వైసీపీకి అనుకూలంగా ప‌దే ప‌దే క‌థ‌నాలు ప్ర‌సార‌మ‌వుతుంటాయి. ఇక్క‌డ ప్ర‌జాప‌క్షం క‌న్నా, జ‌గ‌న్ ప‌క్షం, వైసీపీ ప‌క్ష‌మే క‌న‌ప‌డుతుంటుంది.