అన్నదమ్ములకు గానీ, అక్కచెల్లెళ్లకు గాని ఒకేసారి పెళ్లి చేయవచ్చా?

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దవారు అనటం తరచుగా వింటూ ఉంటాం. పెళ్లి అనేది ఇటు స్త్రీ జీవితాన్ని … అటు పురుషుడి జీవితాన్ని పూర్తిస్థాయిలో ప్రభావితం చేస్తూ వుంటుంది. పెళ్లి అనే ఈ పవిత్రమైన కార్యం వెనుక వధూ వరులిద్దరే కాదు, రెండు కుటుంబాలు … రెండు వంశాలు కనిపిస్తాయి. పెళ్లి విషయంలో ఏ వైపు నుంచి ఎలాంటి తేడా వచ్చినా, ఆ ప్రభావం కొన్ని తరాలపై పడుతుంది.

ఈ కారణంగానే పెళ్లి విషయంలో పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి ఒకే ఇంట్లో అన్నదమ్ములకు గానీ, అక్కచెల్లెళ్లకు గాని వెంటవెంటనే సంబంధాలు కుదిరిపోతుంటాయి. అయితే సంతానంలో పెద్దవారిగా వున్న అబ్బాయికైనా … అమ్మాయికైనా పెళ్లైపోతే, ఏడాదిలోపు రెండోవారికి పెళ్లిచేయకూడదనే నియమం మన సంప్రదాయంలో కనిపిస్తూ వుంటుంది.