అమెరికాలో ఆంధ్రా ఎన్నారై అనుమానాస్పద మృతి     2018-08-20   11:14:13  IST  Bhanu C

భారత్ నుంచీ ఎంతో మంది విదేశాలకి వలసలు వెళ్తూనే ఉంటారు వారి వారి ఆర్ధిక స్థితిగతులని మెరుగు పరుచుకోవడం కోసమో లేక ఉన్నత విద్యలకోసమో ఇలా అనేక రకాల కారణాల వలన వారు తమ సొంత ఊరు, దేశాన్ని, కుటుంభాలని విడిచి పరాయి దేశం వెళ్తూ ఉంటారు అయితే సొంత వారిని చూసుకోవాలి అన్నా సరే సొంత ఊళ్ళకి రావాలన్నా సరే ఏళ్ళు పడుతుంది అయితే ఈ క్రమంలో ఎంతో మంది అక్కడ ఎదో ఒక కారణంతో అనారోగ్యం పడటమో లేక ఇతరాత్రా కారణాల వలన మరణించడం జరుగుతుంది ఇలాంటి ఘటనే ఇప్పుడు అమెరికాలో చోటు చోటుచేసుకుంది..వివరాలలోకి వెళ్తే..

Bholla Veera Venkata Satya Suresh 35,NRI,సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోళ్ల వీర వెంకట సత్య సురేష్ (35)

ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ,ఏలూరు కి చెందిన చెందిన ఓ ఇంజనీర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అమెరికా మేరీల్యాండ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బోళ్ల వీర వెంకట సత్య సురేష్ (35) అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుని స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెంగా గుర్తించారు. సురేష్ రెండేళ్ల క్రితమే అమెరికా వెళ్లాడు. సురేష్ కారులో చనిపోయి ఉండడాన్ని గమనించి స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

ఈ మధ్య కాలంలోనే డి మౌంట్‌లో తెలుగు యువకుడు దీపక్‌ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా పామూరు వాసి అయిన దీపక్… ఉద్యోగం కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదనిగాని.. దీపక్‌ మృతి చెందినట్టు అమెరికా పోలీసులు తల్లిదండ్రులకు ఫోన్‌ చేశారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు తన కుమారుడు మృతిపై విచారణ జరిపించాలని మృతుని తల్లి తండ్రులు కోరుతున్నారు..