కేసీఆర్ పై ఆంధ్రా ప్రజల గుర్రు..ఒక్క ఓటు కూడా వెయ్యం     2018-06-22   00:25:04  IST  Bhanu C

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు చుక్కలు చూపించనున్నారా ..? ఒక్కటంటే ఒక్క ఆంధ్రావాళ్ళ ఓటు పడదని కేసీఆర్ రిపోర్ట్ లో తేలిందా..? ఒకప్పుడు కేసీఆర్ ని ఎంతో సొంత మనిషిలా చూసుకున్న ఆంధ్రా ఓటర్లు ఇప్పుడు ఛీ కొడుతున్నారు..టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడిగితే కనీసం తలుపులు కూడా తీయం అంటూ కేసీఆర్ పై తమ ఆవేశాన్ని వ్యక్తపరిస్తున్నారు..వివరాలలోకి వెళ్తే ,

తెలంగాణ సీఎం కేసీఆర్ కి వచ్చే ఎన్నికల్లో ఆంధ్రోడి వాళ్ళ దెబ్బ గట్టిగానే తగులుతుందట..అయితే దానికి నిదర్సనమే.. మొన్న కర్ణాటకాలో జరిగిన ఎన్నికలు అంటున్నారు..మేము నమ్మితే గుండెల్లో పెట్టుకుని చుసుకుంటామని మాకు గాని మా ఆంధ్రా కి గాని చిన్న హాని తలపెట్టినా ఊరుకోబోమని అంటున్నారట..సాటి తెలుగు రాష్ట్రం అయిన ఎపీకి కేంద్రం చేస్తున్న సహాయనిరాకరణ తో దేశంలో కొన్ని రాష్ట్రాలు కేంద్రం వైఖరిని ఎండగడుతున్నాయి మమతా, నితీష్, కుమారస్వామి వంటి నెతలు ఆంధ్రాకు అండగా నిలుస్తున్నారు అయితే కేసీఆర్ మాత్రం కనీసం ఒక్క మాటకూడా మాట్లాడక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.