రెండో పెళ్లి చేసుకున్న యాంకర్ భర్త..! షాక్ లో తెలుగు టాప్ యాంకర్..!     2018-08-18   11:29:35  IST  Sainath G

తెలుగు టీవీ చానెల్స్ లో సుమ తర్వాత ఫేమస్ యాంకర్ ఎవరు అంటే గుర్తొచ్చేది “ఝాన్సీ” గారు. బాగా చలాకీగా యాంకరింగ్ చేయడంలో ఝాన్నీ స్టైలే వేరు.. ఇప్పటికీ పలు చానెల్స్ లో వివిధ కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది.అయితే పదేళ్ల కింద జెమినీ టీవీలో ప్రసారమైన ఒక ప్రోగ్రామ్ ఝాన్నీ లైఫ్ ను మలుపు తిప్పింది. జెమినీ టీవీలో వచ్చిన ఆ ప్రోగ్రాంలో ఝాన్సీ రోజుకో భిన్న గెటప్ తో సినిమాలపై విశ్లేషణలు చేసింది. ఆ కార్యక్రమానికి ఇప్పుడు కమెడియన్ గా పేరు తెచ్చుకున్న జోగినాయుడు ప్రోగ్రాం డైరెక్టర్ గా చేసేవాడు. ఇలా ఝాన్సీ, జోగినాయుడు మధ్య పరిచయం, ప్రేమగా మారి వీరిద్దరి పెళ్లి వరకూ దారి తీసింది.

Annavaram,Jogi Naidu Second Marriage

ఆపై వారిద్దరి మధ్యా వచ్చిన మనస్పర్థల కారణంగా వారు విడిపోయారు. ఇప్పుడు మరోసారి పెళ్లి పీటలు ఎక్కిన జోగినాయుడికి పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వర్ధమాన సినీ నటుడు జోగినాయుడు వివాహం గురువారం అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో జరిగింది.విశాఖ జిల్లా నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన జోగినాయుడు తన స్వగ్రామానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకోవడం విశేషం. వీరి పెళ్లితో యాంకర్ ఝాన్సీకి షాక్ కు తగిలినట్టే భావిస్తున్నారు. ఎందుకంటే భర్తతో విడిపోయినా కూడా ఝాన్సీ మరో పెళ్లి చేసుకోలేదు.కానీ జోగినాయుడు చేసుకోవడం విశేషం.