Anasuya to sizzle in another item song ?

సుకుమార్ సినిమాలు అంటే ఇప్పుడు ఫారెన్ లోకేషన్స్, ఇంటెలిజెంట్ కథాకథణాలు గుర్తుకువస్తున్నాయి కాని, ఒకప్పుడు సుకుమార్ సినిమాలు అంటే మనకు ప్రేక్షకులకి ఐటం సాంగ్స్ గుర్తుకువచ్చేవి. ఆర్యలో ఆ అంటే అమలాపురం, జగదంలో 36-24-36, ఆర్య 2 లో రింగా రింగా, 100% లవ్ లో డియాలో .. ఇలా బ్లాక్బస్టర్ ఐటం సాంగ్స్ సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో వచ్చాయి. 1-నేనొక్కడినేలోని ఐటం సాంగ్ ఒకటే అనుకుంటా, సరిగా పేలలేదు. ఇక నాన్నకు ప్రేమతోలో ఐటం సాంగ్ ఎలాగో లేదు. దాంతో సుకుమార్ ఐటం సాంగ్ ట్రెండ్ ని వదిలేసాడెమో అనుకున్నారంతా. అలాంటిదేమీ లేదంట. రంగస్థలం 1985లో మళ్ళీ ప్రేక్షకుల అంచనాలను అందుకునే ఐటం సాంగ్ ఒకటి ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ పాటలోని స్పెషాలిటి ఏమిటంటే, యాంకర్ అనసూయ ఈ పాటలో నర్తించనుందని వార్తలు వస్తున్నాయి.

అనసూయ ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ సినిమా విన్నర్ లో “సూయ సూయ అనసూయ” అనే పట ఒకటి చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అవడం వల్లనేమో, పెద్దగా ప్రాచూర్యం లభించలేదు. కాని సుకుమార్ సినిమాలో పాట అంటే అలా కాదుగా, అందులోనూ ఐటం సాంగ్ అంటే మామూలుగా ఉండదుగా. ఈ పాట చాలా మాస్ గా, ఘాటుగా ఉంటుందని, పాటకి తగట్టుగా అనసూయ బాగా గ్లామరస్ గా కనిపించనుందని తెలుస్తోంది. అనసూయ ఊరికే ఐటం సాంగ్ వరకే కాదు, ఈ సినిమాలో కీలక పాత్ర కూడా పోషిస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న రంగస్థలం 1985 లో సమంత కథానాయిక. ఈ సినిమా షూటింగ్ మొత్తం నవంబర్ లో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాని అయితే డిసెంబర్ లో లేదంటే సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు దర్శనిర్మాతలు.