ట్రాఫిక్ పోలీసులకు అనసూయ ట్వీట్.! నెటిజెన్ల కౌంటర్ హైలైట్.!  

ఇటు బుల్లితెర‌పై రాణిస్తూ అటు వెండితెర‌పై అద్భుత‌మైన పాత్ర‌లు పోషిస్తున్న అన‌సూయ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేసింది. హైదరాబాద్ రోడ్లపై నిర్లక్ష్యంగా కారు నడుపుతున్న ఓ వ్యక్తి వీడియోను ట్వీట్ చేస్తూ.. అతడిపై చర్య తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను కోరారు.

నిన్న సాయంత్రం త‌ను బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 2 దారిలో వెళుతుండ‌గా, ప‌క్క‌న కారు డ్రైవ‌ర్ చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకొని ఎదురుగా ఉన్న మొబైల్‌లో వీడియో చూస్తూ కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఈ స‌న్నివేశాల‌ని అన‌సూయ త‌న మొబైల్ కెమెరాలో బంధించి హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీస్‌కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. డియ‌ర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు నన్ను బ‌య‌పెట్టిస్తున్నాయి. ఇంత‌క ముందు వేరే వారి త‌ప్పిదం వ‌ల‌న నేను ప్ర‌మాదానికి గుర‌య్యాను. ద‌య చేసి ఇలాంటి నిర్ల‌క్ష్య‌పు డ్రైవ‌ర్స్‌ని వ‌దలొద్దు.రోడ్స్ పై త‌మ‌కిష్ట‌మోచ్చిన‌ట్టు డ్రైవ్ చేసే వారికి ఇత‌రుల ప్రాణాలంటే లెక్క‌లేదా అని అన‌సూయ త‌న ట్వీట్‌లో తెలిపింది.

ఈ ట్వీట్‌పై నెనిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు పెడుతున్నారు. ‘కొంపదీసి మీరు స్టీరింగ్ వదిలిపెట్టి ఆ వీడియో తీయలేదు కదా!’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా ‘నాకు డ్రైవింగ్ రాదు..’ అని అనసూయ బదులిచ్చారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, ఘటన జరిగిన ప్రదేశం, సమయం గురించి ట్వీట్ చేసిన అనసూయ.. ఆ కారు నంబర్ చెప్పకపోవడం గమనార్హం. Attachments area