Anando Brahma Review

చిత్రం : ఆనందో బ్రహ్మ
బ్యానర్ : 70 MM ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం : మహి వి రాఘవ
నిర్మాతలు : విజయ్ చిల్ల, శశిధర్ దేవిరెడ్డి
సంగీతం : కె
విడుదల తేది : ఆగష్టు 18, 2017
నటీనటులు : తాప్సి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ తదితరులు

కథలోకి వెళితే :


సిద్ధు (శ్రీనివాస్ రెడ్డి) ఒక బార్ లో పనిచేస్తుంటాడు. ఇతని గుండెకి రంధ్రం ఉంటుంది. దానికి తాత్కాలిక చికిత్స భయమేస్తే నవ్వడం, నవ్వొస్తే బాధపడటం. శాశ్వత చికిత్స కావాలంటే పాతిక లక్షలు కావాలి. సిద్ధుతో పాటు వెన్నెల కిషోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లకి కూడా వేరు వేరు కారణాలతో డబ్బు అత్యవసరం. అలాంటి సమయంలో వీళ్ళు ఓ దెయ్యాల కొంపలో మూడు రాత్రులు గడిపితే డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆ ఇంటి చుట్టు కోట్ల వ్యవహారం ఎందుకు నడుస్తోంది? ఈ కథలో తాప్సి ఎవరు? దెయ్యాలు ఉండే ఇంట్లో వీరు మూడు రాత్రులు గడిపగలిగారా లేదో సినిమాలోనే చూడండి.