సూపర్‌ స్టార్‌.. ఏంటీ చిల్లర పని?     2018-06-29   01:15:14  IST  Raghu V

మలయాళ హీరోయిన్‌ కిడ్నాప్‌ మరియు లైంగిక వేదింపుల విషయం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఒక హీరోయిన్‌కే భద్రత లేదంటూ మహిళ సంఘాల వారు మరియు ప్రజా సంఘాల వారు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. కేంద్రం నుండి కేరళ రాష్ట్ర ప్రభుత్వం వరకు ఈ విషయమై సీరియస్‌గా తీసుకున్నారు. కిడ్నాప్‌కు కారణం అయిన వారిని, వారి వెనుక ఉన్న వారిని కొద్ది కాలం తేడాతోనే పట్టేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దిలీప్‌.

మలయాళ నటుడు అయిన దిలీప్‌ చెప్తే ఆమెను కిడ్నాప్‌ చేసి, లైంగికంగా వేదించాం అంటూ పోలీసుల ఎంక్వౌరీలో కిడ్నాప్‌కు పాల్పడ్డ వారు చెప్పుకొచ్చాడు. దాంతో దిలీప్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు దాదాపు మూడు నెలల పాటు జైల్లోనే ఉంచారు. ఎంక్వౌరీలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆయన చేసిన తప్పుకు త్వరలోనే శిక్ష పడటం ఖాయం అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉండి, కేసు పేచీలకు హాజరు అవుతున్న దిలీప్‌ను అప్పట్లో అసోషియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ (అమ్మ) వారు బహిష్కరించడం జరిగింది.