ఇదే కనుక నిజం అయితే ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పూనకాలే..!     2018-09-11   09:26:17  IST  Ramesh P

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘అరవింద సమేత’ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. చిత్రం టాకీ పార్ట్‌ పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుగుతుంది. వచ్చే నెలలో దసరా కానుకగా ఈ చిత్రంను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. దసరా కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు 24 గంటలు కష్టపడుతున్నారు.

Aravindha Sametha,Ntr,Trivikram

‘అరవింద సమేత’ చిత్రం గురించి ఫిల్మ్‌ సర్కిల్స్‌ నుండి ఆసక్తికర వార్త ఒకటి వినిపిస్తుంది. అదే ఈ చిత్రంలో చిన్న గెస్ట్‌ పాత్రలో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబచ్చన్‌ నటించాడట. ‘మనం’ చిత్రంలో డాక్టర్‌గా అయితే ఎలా కనిపించాడో అమితాబచ్చన్‌ ఈ చిత్రంలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించి వెళ్లిపోతాడని సమాచారం అందుతుంది. ప్రస్తుతం తెలుగులో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్న అమితాబచ్చన్‌ ఆ చిత్రం షూటింగ్‌ సమయంలోనే ఈ చిత్రం కోసం ఒక రోజు కేటాయించినట్లుగా సమాచారం అందుతుంది.

Aravindha Sametha,Ntr,Trivikram

గతంలో బాలకృష్ణ, కృష్ణవంశీలు ‘రైతు’ అనే చిత్రం కోసం అమితాబచ్చన్‌ను సంప్రదించిన సమయంలో ఆయన సున్నితంగా తిరష్కరించాడు. కాని ఇప్పుడు మాత్రం వరుసగా సౌత్‌లో నటించేందుకు ముందుకు వచ్చి అందరిని ఆశ్చర్యపర్చుతున్నాడు. సైరాలో స్నేహం కోసం నటించిన అమితాచ్చన్‌ అరవింద సమేత చిత్రంలో నటించడంకు కారణం ఏంటో అంటూ సినీ వర్గాల వారు ఆలోచిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అరవింద సమేత చిత్రంలో నిజంగానే అమితాబ్‌ ఉంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అమితాబ్‌ చేసే పాత్ర ఎంత చిన్నది అయినా కూడా ఆయన స్థాయి ఆకాశం వంటిది కనుక ఖచ్చితంగా సినిమాకు ప్లస్‌ అవుతాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 20న హైదరాబాద్‌లో ఆడియో విడుదల కార్యక్రమంను నిర్వహించబోతున్నట్లుగా నిర్మాతలు తెలియజేశారు. బాలయ్య బాబు ప్రత్యేక అతిథిగా హాజరు అయ్యే అవకాశం ఉంది.