చక్రం తిప్పిన RSS.. బీజేపి అధ్యక్షుడిగా “అమిత్ షా” ఔట్..?     2018-06-05   03:39:58  IST  Bhanu C

అమిత్ షా తీసుకుంటున్న నిర్ణయాలు…ఆయన ఒంటెద్దు పోకడలు దేశవ్యాప్తంగా బీజేపి పాలిత రాష్ట్రాలలో కాని అక్కడి నాయకులకి కానీ నచ్చడం లేదు..మోడీ అమిత్ షా లు ఇద్దరు చేస్తున్న నిరంకుశత్వ విధానాలు తమ సొంత పార్టీ నేతలకి కూడా రుచించడం లేదట..అయితే ఈ విధానాల వలనే పార్టీ వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది…ఎన్నికల్లో వరుస ఓటములు మసకబారుతున్న పార్టీ ప్రతిష్ట, కర్ణాటకలో జరిగిన అవమానం, ఏకపక్షం గా వ్యవహరించి మిత్రులను దూరం చేసుకోవటం ఇలా ఎన్నో పరిణామాల వలన బీజేపి ఇంటా బయటా విలన్ లా తయారయ్యింది.

చక్రం తిప్పిన RSS.. బీజేపి అధ్యక్షుడిగా “అమిత్ షా” ఔట్..?

అంతేకాదు సీనియర్స్ ని తప్పించడం తదితర అంశాలపై RSS గుర్రు గా ఉందని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అటు పాలన మీద పట్టు లేకుండా ఇటు రాజకీయ పరంగా వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న నేపథ్యంలో RSS అమిత్ షా మీద ఆగ్రహం గా ఉందని, ఆయన్ని తప్పించి కొత్త ప్రెసిడెంట్ ని తీసుకోవాలనే ఆలోచనలో RSS తో పాటు కొందరు బిజెపి సీనియర్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది…అంతేకాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే చాలా దెబ్బ తింటాం అని భావిస్తున్నారని ఆ కథనం సారాంశం.