మామిడి కాయ పొడి (ఆమ్చూర్) లో ఉన్న ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు     2018-07-02   03:47:04  IST  Lakshmi P

మామిడికాయ పొడిని మన దేశంలో ఆమ్చూర్ అని పిలుస్తారు. మామిడికాయ పొడి మార్కెట్ లో దొరుకుతుంది. అలాగే మనం ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చు. మామిడికాయలు వచ్చే వేసవిలో మామిడికాయను ముక్కలుగా కోసి ఎండబెట్టి పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పొడిని అనేక వంటల్లో ఉపయోగిస్తాం. మామిడికాయ పొడితో వంటకు రుచి పెరగటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

జీర్ణక్రియను మెరుగుపరచి అజీర్ణం,మలబద్దకం,గ్యాస్ వంటి సమస్యల నుండి బయట పడేలా చేస్తుంది. ప్రతి రోజు వంటల్లో చిటికెడు మామిడికాయ పొడి వేస్తె చాలు. మామిడికాయ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన జీర్ణక్రియలో సహాయపడి కేలరీలు బాగా ఖర్చు అయ్యి బరువు కూడా తగ్గుతారు.