నిమ్మకాయ,బొప్పాయి కలిపి జ్యుస్ గా తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..?

ప్రతి రోజు ఉదయం పరగడుపున బొప్పాయి,నిమ్మకాయ జ్యుస్ ని తీసుకుంటే మన శరీరానికి ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు చేకూరతాయి. మన శరీరంలో అవయవాల మీద ప్రత్యేకంగా పనిచేసి ఎంతో రక్షణను కల్పిస్తుంది. ఈ జ్యుస్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. బాగా పండిన బొప్పాయి పండును ముక్కలుగా కోసి జ్యుస్ చేసుకొని దానిలో నిమ్మరసం కలుపుకొని త్రాగాలి.

ఈ జ్యుస్ క్యాన్సర్ కణాలపై పోరాటం చేస్తుంది. ముఖ్యంగా ప్రోస్టేట్ మరియు బ్లడ్ కాన్సర్ ను నివారణలో బాగా సహాయపడుతుంది. శరీరంలో చలనం లేని కణాలను తొలగించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన అథిరోస్ క్యాలరీలు మరియు కార్డియో వేస్కులర్డిసు లు రాకుండా నివారించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.


నిమ్మకాయ – బొప్పాయి కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్, మినరల్స్, ఫోలేట్, పొటాషియం వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమయ్యే పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి మరియు నిమ్మరసంలో విటమిన్ ‘C’,’B’ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి.

ఎసిడిటీ లెవెల్స్ ను తగ్గించటంలో సహాయం చేయటం వలన జీర్ణశక్తి పెరుగుతుంది.ఈ జ్యుస్ లో ఉండే ‘A’,’C’ లు యాప్టిక్ లెవెల్స్ ను పెంచుతాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో బాగా సహాయపడుతుంది. అలాగే ఈ జ్యుస్ లో యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన జాయింట్ పెయిన్స్, తలనొప్పి, ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

,