లిచి పండ్లలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?     2018-06-15   23:27:24  IST  Lakshmi P

ఎర్రగా నిగనిగలాడుతూ ఉండే లిచి పండ్లు ఈ మధ్య కాలంలో రోడ్డు పక్కన ఎక్కువగా అమ్ముతున్నారు. అయితే వీటి గురించి చాలా మందికి తెలియదు. ఈ పండ్ల వాడకం ఈ మధ్యనే పెరిగింది. ఈ పండ్లు ఎక్కువగా చైనాలో పండుతాయి. ఈ పండ్లను తినటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే మీరు కూడా ఆ పండ్లను కొని తినటం ప్రారంభిస్తారు.

ఈ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడటమే కాకుండా రక్తంలో తెల్లరక్త కణాలు పెరగటానికి సహాయపడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ పండును తింటే ఈ పండులో ఉండే డైటరీ ఫైబర్ విరేచనం సాఫీగా అయ్యేలా చేసి మలబద్దకం సమస్యను తరిమికొడుతుంది. అంతేకాకుండా మనం తీసుకొనే ఆహారంలోని పోషకాలు శరీరం గ్రహించేలా చేస్తుంది.