నల్ల మిరియాలలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

నల్ల మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది. ప్రతి రోజు నల్ల మిరియాలను తినే కోట్లాది మందికి, ఇది ఒక ఔషధ మసాలా అనే విషయం తెలియకపోవచ్చు. అంతేకాక నల్ల మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.

1. యాంటిబయోటిక్ లక్షణాలు
నల్ల మిరియాల్లో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన సహజమైన యాంటిబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్ ప్రతిచర్యలను అదుపులో ఉంచుతుంది. ఇది నల్ల మిరియాల ప్రధాన ఉపయోగాల్లో ఒకటిగా ఉంది.

2. గ్యాస్ట్రిక్ వ్యాధులు
నల్ల మిరియాలను ఆహారంలో తీసుకుంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్రవించడం ద్వారా జీర్ణ ప్రక్రియను తేలిక చేస్తుంది. అలాగే ప్రేగు మరియు కడుపు సంబంధించిన వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.