కాకరకాయ చేదైనా.. ఔషధ గుణాలు పుష్కలం     2017-10-19   21:58:52  IST  Lakshmi P

Amazing Benefits Of Bitter Gourd

కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినటానికి ఇష్టపడరు. అయితే కాకరకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆ ఔషధ గుణాలు గురించి తెలుసుకుంటే తప్పనిసరిగా కాకరకాయను తినటం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు కాకరకాయలో ఉన్న ఔషధ గుణాలు అవి మన ఆరోగ్యానికి ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం.

రక్తంలో షుగర్ లెవల్స్ ని బేలన్స్ చేయగల సామర్ధ్యం కాకరకాయకు ఉంది. అలాగే కాకరకాయ జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది. ఆకలిని పెంచి కడుపునొప్పిని తగ్గిస్తుంది. నులిపురుగులను సైతం నశింపజేయగల ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న అధిక కొలస్ట్రాల్ ని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.