మెగా హీరోకూ సామాన్యుడి కష్టం తప్పలేదు!     2018-06-22   00:20:48  IST  Raghu V

ఎంతటి సెలబ్రెటీ అయినా కూడా కొన్ని సార్లు సామాన్యుడి మాదిరిగానే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలు సామాన్యుడికి, సెలబ్రెటీలకు సమానంగా ఉంటాయి. ఆకలి వేయడం, వాతావరణం ఇలా కొన్ని విషయాల్లో హీరోలు అయినా, మెగా హీరోలు అయినా సామాన్యులకైనా ఒకే విధంగా ఫీలింగ్స్‌ ఉంటాయి. ఆ ఫీలింగ్స్‌ను ఎంత డబ్బుతో అయినా కొనలేక పోవచ్చు. తాజాగా మెగా హీరో అల్లు శిరీష్‌కు చాలా చిరాకు కలిగింది. ఈయన వాడుతున్న ఫోన్‌ ఆ చిరాకుకు కారణం అయ్యింది. సోషల్‌ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

ప్రస్తుత కాలంలో చేతిలో ఫోన్‌ లేకుంటే ఏ పని చేయలేం. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అంతా కూడా ఫోన్‌ చేతుల లేకుంటే ఏదో మిస్‌ అయినట్లుగా బాధ పడి పోతూ ఉంటారు. అలాంటిది చేతిలో ఉన్న ఫోన్‌లో సిగ్నల్‌ లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. ఎక్కువగా పల్లెటూరు జనాలు మొబైల్‌లో సిగ్నల్‌ సమస్యలను ఎదుర్కొంటారు. పట్టణాల్లో మొబైల్‌ సిగ్నల్‌ సమస్యలు చాలా తక్కువ. అయితే మెగా హీరో అల్లు శిరీష్‌ మాత్రం మొబైల్‌ నెట్వర్క్‌ సమస్యతో చిరాకు పడుతున్నాడు. ఏం చేయాలో పాలు పోక తాజాగా ట్విట్టర్‌ ద్వారా తన అసహనంను వ్యక్తం చేయడంతో పాటు, అన్ని విధాలుగా మొబైల్‌ నెట్వర్స్‌లను విమర్శించాడు.