అల్లు అర్జున్‌ ప్లాన్‌ అదుర్స్‌.. నువ్వు సూపర్‌ ఎహే!    2018-05-16   01:39:18  IST  Raghu V

వరుస విజయాలతో దాదాపు రెండు సంవత్సరాలుగా అల్లు అర్జున్‌ జోరు మీదున్నాడు. వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్‌ అయిదవ విజయాన్ని నా పేరు సూర్య చిత్రంతో దక్కించుకుంటాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా అల్లు అర్జున్‌ నా పేరు సూర్య చిత్రంతో ఫ్లాప్‌ను మూట కట్టుకున్నాడు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం విఫలం అయ్యింది. బన్నీ చాలా అంచనాలు పెట్టుకుని చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను రీచ్‌ కాలేక పోయింది. అందుకే అల్లు అర్జున్‌ తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అల్లు అర్జున్‌ ‘నా పేరు సూర్య’ చిత్రం సక్సెస్‌ అయితే తన తదుపరి సినిమాగా ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని చేయాలని మొదటి నుండి అనుకున్నాడు. కాని ప్రస్తుతం ఆ ఆలోచనను విరమించుకున్నాడు. నా పేరు సూర్య చిత్రంతో ఫ్లాప్‌ అయిన తాను ఇప్పుడు ప్రయోగం పేరుతో మరో ఫ్లాప్‌ను చవి చూస్తే కెరీర్‌ కష్టాల్లో పడుతుందనే ఉద్దేశ్యంతో కమర్షియల్‌, ఎంటర్‌టైనర్‌గా తన తదుపరి చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన చర్చు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో చేయాలని భావించిన బన్నీ ఇప్పుడు మరో దర్శకుడిని వెదికే పనిలో ఉన్నాడు.