నా పేరు సూర్య ఆడటం కష్టమే.. ఎందుకంటే!     2018-04-28   04:09:59  IST  Raghu V

అల్లు అర్జున్‌ హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ చిత్రంపై మొన్నటి వరకు అందరిలో అంచనాలు భారీగా ఉండేవి. కాని తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాపై ఎక్కడో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేదేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

గతంలో వచ్చిన రెండు మూడు సినిమాలను మిక్సీలో వేసి రుబ్బి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగానే ట్రైలర్‌ చూస్తే అనిపిస్తుందంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ ఇటీవల వరుసగా సక్సెస్‌లు దక్కించుకుంటూ దూసుకు పోతున్నాడు. కాని ఈ చిత్రం ఆయనకు సక్సెస్‌ను ఇవ్వడం కష్టమే అంటున్నారు. ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కాస్త ఎక్కువగానే దట్టించినట్లుగా అనిపిస్తుందని ట్రైలర్‌లో కనిపిస్తుంది. అను ఎమాన్యూల్‌, బన్నీల మద్య లవ్‌ ట్రాక్‌ సినిమా మెయిన్‌ స్ట్రీమ్‌ను దెబ్బ తీసే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.