Allu Arjun is no match to NTR

డీజే – దువ్వాడ జగన్నాథం టీజర్ రానే వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణ పాత్రలో కనిపిస్తుండగా, పూజ హెగ్డే బన్నిని బుట్టలో వేసుకునే లో మోడ్రన్ యువతిగా అలరించనుంది. ఇక బ్రాహ్మణ పాత్ర అనగానే మనకు అదుర్స్ సినిమా గుర్తుకువస్తుంది, అందులో ఎన్టీఆర్ పోషించిన చారి పాత్ర గుర్తుకు వస్తుంది.

చారి పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయిన తీరు నిజంగా అద్భుతం. ఇప్పుడంటే ఎన్టీఆర్ వైవిధ్యతతో మెప్పిస్తున్నాడు కాని ఆ టైమ్ లో ఫక్తు మాస్ హీరో. అలాంటి టైమ్ చారి లాంటి పాత్రలో ఎన్టీఆర్ అంతలా అలరించడం మామూలు విషయం కాదు.

అల్రెడీ ఎన్టీఆర్ పోషించినటువంటి పాత్రను అల్లు అర్జున్ డిజేలో ఎంచుకున్నాడంటే అదో పెద్ద సాహసమనే చెప్పాలి. మరి ఈ సాహసం సినిమా విడుదలయ్యాక సత్ఫలితాలను ఇస్తుందా లేదా చెప్పలేం కాని, టీజర్ కి మాత్రం మిశ్రమ స్పందనే లభిస్తోంది.

అసలు ఎన్టీఆర్ ని, బన్నిని పోల్చి చూడాల్సిన అవసరమే లేదని, ఏ యాంగిల్ లో కూడా అర్జున్ ఎన్టీఆర్ కి సరితూగట్లేదని, ఇదేదో చారి పాత్రకు స్పూఫ్ లా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒక్క టీజర్ కే బన్నిని విమర్శించడం సరైన విషయం కాకపోయినా, అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి ఒక్క మెతుకు చాలు కదా అని లాజిక్ మాట్లాడుతున్నారు సినీజనాలు.