దారుణం : ఆమెను రేప్‌ చేస్తామంటున్న బన్నీ ఫ్యాన్స్‌     2018-05-11   23:58:50  IST  Raghu V

అభిమానంకు హద్దు పద్దు తప్పనిసరిగా ఉండాలి. అలా లేకుంటే ఇబ్బందులు తప్పవు. హీరోల అభిమానులు కొన్ని సార్లు వ్యవహరించే తీరు, వారు మాట్లాడే మాటలు, ఇతర హీరోలను ట్రోల్‌ చేసే విధానం దారుణంగా అనిపిస్తుంది. ఎందుకు ఇంతగా వీరు రియాక్ట్‌ అవుతున్నారు అని స్వయంగా ఆ హీరోలే ఆవేదన వ్యక్తం చేస్తారు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు తమ అభిమాన హీరోపై ఎవరైనా కామెంట్స్‌ చేస్తే వారిని ఉతికి ఆరేసే వరకు ఊరుకోరు. తన అభిమానుల వల్ల పవన్‌ పలు సందర్బాల్లో మాట పడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే అనుభవం అల్లు అర్జున్‌కు ఎదురైంది.

మెగా హీరోల్లో ఒక్కడైన అల్లు అర్జున్‌కు ఇతర స్టార్‌ హీరోతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ తక్కువే అని చెప్పుకోక తప్పదు. అయితే ఈయనకు కేరళలో అభిమానులు లెక్కకు మించి ఉన్నారు. కేరళ సూపర్‌ స్టార్స్‌ మోహన్‌ లాల్‌ మరియు మమ్ముటిల స్థాయిలో బన్నీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అందుకే బన్నీ ఏ సినిమా చేసినా కూడా కేరళలో భారీగా విడుదల అవ్వడం జరుగుతుంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబడుతుంది. ఇప్పటి వరకు ఏ ఇతర భాష హీరో కూడా కేరళలో ఇంతగా అభిమానగణంను ఏర్పాటు చేసుకోలేక పోయాడు. కేరళలో అల్లు అర్జున్‌ అభిమాన సంఘాలు భారీగానే ఉన్నాయి.