బన్నీ కోసం దాగుడు మూతలు ఆపేశాడు     2018-05-26   04:43:46  IST  Raghu V

వరుస విజయాల తర్వాత అల్లు అర్జున్‌కు ‘నా పేరు సూర్య’ చిత్రంతో అట్టర్‌ ఫ్లాప్‌ ఖాతాలో పడటం జరిగింది. భారీ అంచనాలు పెట్టుకున్న నాపేరు సూర్య చిత్రం నిరాశ పర్చడంతో అల్లు అర్జున్‌ ఆలోచనల్లో పడ్డాడు. నా పేరు సూర్య చిత్రం సక్సెస్‌ అయితే ఇప్పటికే విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కేది. కాని ఫ్లాప్‌ తర్వాత ప్రయోగం ఎందుకు అంటూ ఆ చిత్రాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లుగా సమాచారం అందుతుంది. ఒక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను చేయానే పట్టుదలతో అల్లు అర్జున్‌ ఉన్నాడు. అలాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను కేవలం హరీష్‌ శంకర్‌ మాత్రమే చేయగలడు అనే నమ్మకంతో బన్నీ ఉన్నాడు.

వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో ‘డీజే’ చిత్రం వచ్చింది. గత సంవత్సరంలో సూపర్‌ హిట్‌ చిత్రాల జాబితాలో నిలిచిన డీజే చిత్రం బన్నీ కెరీర్‌లో కూడా పెద్ద విజయంగా నిలిచింది. అలాంటి సినిమాను తనకు అందించిన హరీష్‌ శంకర్‌తో మరోసారి సినిమా చేయాలనే నిర్ణయానికి అల్లు అర్జున్‌ వచ్చాడు. ఇటీవలే వీరు కలిశారు కూడా. వీరు కలిసినప్పటి సెల్ఫీ కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. వీరితో పాటు పూజా హెగ్డే కూడా ఆ సెల్ఫీలో ఉంది. అంటూ డీజే చిత్రం కోసం వర్క్‌ చేసిన దర్శకుడు, హీరో హీరోయిన్‌ల కాంబో రిపీట్‌ కాబోతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.