సూర్యను చంపేయాలని చూస్తున్నది ఎవురు?     2018-04-29   22:56:52  IST  Raghu V

మెగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా అను ఎమాన్యూల్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. మే 4న విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామ్‌ చరణ్‌ హాజరు కావడం జరిగింది. గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ హీరోలపై, సినిమా పరిశ్రమపై న్యూస్‌ ఛానెల్స్‌ కాస్త అతిగా స్పందిస్తూ వార్త కథనాలు ప్రసారం చేస్తున్న విషయం తెల్సిందే. ఆ విషయమై పవన్‌ కళ్యాణ్‌ పెద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడంతో సినిమా పరిశ్రమ వారు న్యూస్‌ ఛానెల్స్‌పై చర్యలకు సిద్దం అవుతున్నాయి.

ఇలాంటి సమయంలోనే ‘నా పేరు సూర్య’ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను టీవీ9కు ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పేసింది. కేవలం ఎన్‌టీవీకి మాత్రమే ఈ చిత్రం ప్రమోషన్‌ హక్కులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ఈ చిత్రంపై కుట్ర జరుగుతుంది. ఈ చిత్రాన్ని నాశనం చేసేందుకు, బ్యాడ్‌ టాక్‌ను తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది. ఈ విషయాన్ని నీకు తర్వాత చెబుతాను అంటూ బన్నీని ఉద్దేశించి అనడం జరిగింది. కొన్ని న్యూస్‌ ఛానెల్స్‌పై గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ చిన్నపాటి యుద్దమే చేస్తోంది. ఆ కారణంగానే వారు ఈ చిత్రాన్ని నాశనం చేయాలని భావిస్తు ఉండవచ్చు అనేది కొందరి అనుమానం.