అల్లరోడు తనకు తానే దిగజారుతున్నాడు     2018-05-31   01:19:20  IST  Raghu V

ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఆయన వారసులు అయిన ఆర్యన్‌ రాజేష్‌ మరియు అల్లరి నరేష్‌లు హీరోలుగా పరిచయం అయ్యారు. ఆర్యన్‌ రాజేష్‌కు హీరోగా మంచి భవిష్యత్తు ఉందని అంతా భావించారు. కాని ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో పెద్దగా నెగ్గుకు రాలేక పోయాడు. అల్లరి నరేష్‌ హీరో అవుతాడని ఎవరు భావించలేదు. కాని ఆయనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కామెడీ హీరోగా తనకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకున్న అల్లరి నరేష్‌ మినిమం గ్యారెంటీ హీరో అంటూ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు.

మినిమం గ్యారెంటీ హీరో కాస్త వరుస ఫ్లాప్‌లతో దిగజారి పోయి తన స్థాయిని తగ్గించుకుంటున్నాడు. ఆయన సినిమాల ఎంపిక మరియు దర్శకుల ఎంపిక తప్పిదాల వల్ల ‘సుడిగాడు’ తర్వాత ఇప్పటి వరకు సక్సెస్‌ను దక్కించుకోలేక పోయాడు. ఏమాత్రం ఆకట్టుకోని సినిమాలను చేస్తూ అల్లరోడు తన మార్క్‌ను దూరం చేసుకున్నాడు. ప్రేక్షకులు కూడా అల్లరోడి సినిమా అంటే లైట్‌ తీసుకునే స్థాయికి వచ్చేశారు. ఈ సమయంలోనే అల్లరి నరేష్‌ రెండు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. ఆ రెండు సినిమాల్లో కూడా ఈయన వేరే హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు.