Alcohol thrice a week will cut down diabetes risk – study

మోడరేట్ డ్రింకింగ్ వేరు, ఓవర్ డ్రింకింగ్ వేరు. మోడరేట్ డ్రింకింగ్ అంటే ఓ లిమిట్ లో, ఓ పద్దతిగా తాగడం. ఇలా తాగడం చాలా ఆరోగ్యకరమని మేము కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మద్యం ఓ లిమిట్ లో తీసుకుంటే ఎంత లాభమో మీరు చాలాసార్లు చదివేశారు. రోజుకి ఓ డ్రింక్ మందు మంచిదే అని డాక్టర్లు సైతం ఒప్పుకుంటారు. ఇప్పుడు మరో కొత్త లాభంతో ముందుకొచ్చారు National Institute of Public Health at University of Denmark పరిశోధకులు.

వారి పరిశోధనల ప్రకారం వారానికి మూడు నుంచి నాలుగు సార్లు మద్యం ఓ లిమిట్ గా తాగితే ఇటు పురుషులలో, అటు మహిళలలో డయాబెటిక్ వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయట. “మా పరిశోధనల ప్రకారం ఎవరైతే వారానికి మూడు నాలుగు డ్రింక్స్ తో సరిపెట్టుకుంటారో, వారికి షుగర్ వ్యాధి అవకాశం చాలా తక్కువ అని తేలింది. అంటే రాండం డేస్ లో తీసుకోవాలి. అతిగా తాగకూడదు. మా పరిశోధన అదే విషయాన్ని చెబుతోంది” అని అంటున్నారు డెన్మార్క్ పరిశోధకులు.