ఆ ఊరిలో భార్యలను అద్దెకు ఇస్తారు.! ఎంత దారుణమో చూడండి.!     2018-07-02   01:14:06  IST  Raghu V

భారతదేశంలోని స్త్రీ ను ఒక ఆటబొమ్మల ఒక వస్తువుగా చూడటం ఇప్పటికి కొనసాగుతుందనే చెప్పాలి.ఆడపిల్ల అంటేనే చీదరింపులు ఎదుర్కొనే పరిస్థితులు నిత్యం వార్తల్లో పేపర్ లో వస్తూనే ఉంటాయి.ఒకరకంగా స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చింది ఈ సమాజం. పుస్తకాల్లో ఏమో స్త్రీని దేవతతో పోలుస్తూ గౌరవిస్తున్నారు. కానీ బయట సమాజంలో మాత్రం కొందరు స్త్రీ అంటే కేవలం పడక సుఖానికి అన్నట్టు భావిస్తున్నారు.

వధువు కట్నం ఇవ్వడమే తప్పు ఆచారం అని భావిస్తుంటే…ఆ ఊరిలో ఏకంగా భార్యలను అద్దెకు ఇస్తారంటే. ఎంతటి అపచారం కదా.? ఇంతకీ ఈ సంప్రదాయం ఎక్కడ అనుకుంటున్నారా.? మన దేశంలోనే ఇలాంటి సంప్రదాయం ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాంటి దారుణాలు మద్యప్రదేశ్‌తో పాటు, రాజస్థాన్‌, గుజరాత్‌లో తరచూ జరుగుతుంటాయి.