చంద్ర‌బాబు ఆ ఇద్ద‌రు లీడ‌ర్ల‌కు క‌రివేపాకే..!     2018-04-23   02:44:17  IST  Bhanu C

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు 40 ఏళ్ల‌ సుదీర్ఘ రాజ‌కీయ అనుభవం ఉంది. రాజ‌కీయాల్లో ఇప్పుడున్న వారిలో దాదాపు అంద‌రూ జూనియ‌ర్లేన‌ని ఆయ‌న చెబుతూ ఉంటారు. అయితే, పార్టీలోని కొంద‌రు మాత్రం చంద్ర‌బాబును క‌రివేపాకు క‌న్నా ఘోరంగా తీసిపారేస్తున్నారు. ఆయ‌న ఏం చెప్పినా ఇలా విని.. అలా వ‌దిలేస్తున్నారు. త‌మ త‌మ పంతాల‌నే పాటిస్తున్నా రు. త‌మ ఆధిప‌త్య ధోర‌ణుల‌నే అనుస‌రిస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాల‌పై చంద్ర‌బాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ భూమా, ఏవీ కుటుంబాల వార‌సుల మ‌ధ్య తలెత్తిన విభేదాలు చినుకు చినుకు గాలివాన‌గా మారిన‌చందంగా పార్టీ ప‌రువును గాలిలో క‌లిపేస్తున్నాయి.

మంత్రి భూమా అఖిల ప్రియ‌, దివంగ‌త భూమా నాగిరెడ్డి అనుచ‌రుడు ఏవీ సుబ్బారెడ్డిల మ‌ధ్య త‌లెత్తిన వివాదం ఇప్పుడు బ‌జారున ప‌డింది. మంత్రి అఖిల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆళ్ల‌గ‌డ్డ‌పై ఏవీ సుబ్బారెడ్డి ఆశ‌లు పెంచుకున్నారు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల్లో ఈ సీటు నుంచి పోటీ చేసి గెలుపొందాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. అదేస‌మ‌యంలో తాను టీడీపీలో ఎంతో కాలంగా ఉన్నా నని, త‌న‌కూ భారీ ఎత్తున మ‌ద్ద‌తిచ్చే అనుచ‌ర గ‌ణంకూడా ఉంద‌ని ఆయ‌న గ‌తం కొన్నాళ్లుగా వెల్ల‌డిస్తూనే ఉన్నాడు. దీంతో అఖిలకు, ఏవీకి మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో అగాథం ఏర్ప‌డింది. గ‌త ఏడాది జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌యం లోనే ఏవీ ఆ టికెట్‌పై ఆశ‌లు పెట్టుకున్నాడు.