అఖిల‌కు టిక్కెట్ టెన్ష‌న్‌... ఆ వ్యాఖ్య‌ల మ‌ర్మ‌మేంటో..!     2018-06-09   00:15:06  IST  Bhanu C

ఏపీ కేబినెట్‌లో త‌క్కువ వ‌య‌స్సు ఉన్న మంత్రిగా ఉన్న భూమా అఖిల‌ప్రియ రాజ‌కీయ ప్ర‌స్థానం ప‌డుతూ లేస్తున్న‌ట్టు సాగుతోంది. ఏక‌గ్రీవంగా ఎమ్మెల్యేగా గెలిచిన అఖిల ఆ త‌ర్వాత తండ్రి నాగిరెడ్డి మృతితో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా మంత్రి అయ్యారు. ఆమెకు ఇచ్చిందే పెద్ద‌గా ప్రాధాన్య‌త లేని శాఖ‌. రాజ‌కీయంగా ఆమె ఆరితేర‌క‌పోవ‌డంతో స‌రైన వ్యూహాలు ప‌న్న‌లేక‌పోతున్నారు.

రోజు రోజుకు ఆమెకు జిల్లాలో సొంత పార్టీలోనే శ‌త్రువులు ఎక్కువైపోతున్నారు. ముందుగా ఆళ్ల‌గ‌డ్డ సీటు విష‌యంలో ఏవి.సుబ్బారెడ్డితో ఆమెకు స్టార్ట్ అయిన ర‌గ‌డతో సుబ్బారెడ్డి ఒక్క‌రే అఖిల‌కు శ‌త్రువు కాలేదు. ఇటు జిల్లాకే చెందిన సీనియ‌ర్ మంత్రి కేఈ.కృష్ణ‌మూర్తితోనూ ఆమెకు అంత స‌ఖ్య‌త లేదు. ఇక తాజాగా బ‌న‌గాన‌ప‌ల్లె బీసీ.జ‌నార్థ‌న్‌రెడ్డి సైతం ఆమెపై నేరుగా చంద్ర‌బాబుకే ఫిర్యాదు చేశారు.