ఆయ‌న కోసం మంత్రి సీటు త్యాగం చేయాల్సిందే... బాబు ఫిక్స్ అయ్యారా     2018-04-14   00:47:04  IST  Bhanu C

క‌ర్నూలు జిల్లా టీడీపీ రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డ్డాయి. సొంత పార్టీ నేత‌లే క‌త్తులు నూరుకుంటున్న ప‌రిస్థితి నెల కొంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌పై ఉన్న భూమా నాగిరెడ్డి అనుచ రుడు ఏవీ సుబ్బారెడ్డికి, భూమా కుమార్తె, మంత్రి అఖిల ప్రియ‌ల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. భూమాకు అత్యంత న‌మ్మ‌క‌స్తుడుగా మెలిగిన ఏవీ సుబ్బారెడ్డిని.. త‌న సీటుకు అడ్డం వ‌స్తాడ‌నే ఉద్దేశంతో మంత్రి అఖిల ప్రియ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌క్క‌న పెడుతున్నారు. ఈ క్ర‌మంలోనే సుబ్బారెడ్డి త‌న విశ్వ‌రూపం చూపించాడు. మంత్రి అఖిల ప్రియ‌ను బ‌హిరంగంగా విమ‌ర్శించ‌డంతోపాటు.. అడుగ‌డుగునా ఆమెను విమ‌ర్శించ‌డం ప్రారంభించాడు. దీంతో ఈఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఆధిపత్య పోరు రోడ్డున ప‌డింది.


మంత్రి అఖిల ప్రియ‌, ఏవీ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. భూమాకు అన్ని విధాలుగా అండగా ఉన్న ఆయన ప్రాణ స్నేహితుడు ఏవీ.సుబ్బారెడ్డిని నాగిరెడ్డి కుటుంబం దూరం పెట్ట‌డం వెనుక కేవ‌లం ఆళ్ల‌గ‌డ్డ సీటు వ్య‌వ‌హార‌మేన‌ని అంద‌రికీ తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మంత్రి అఖిల తీరుతో ఏవీ వర్గం అసంతృప్తి గురైంది. పార్టీ గెలుపు కోసం విబేధాలు పక్కన పెట్టాలని అధినేత చంద్రబాబు ప‌దే ప‌దే కోర‌డంతో అఖిల‌తో సంబంధం లేకుండా సుబ్బారెడ్డి.. అప్ప‌టి ఉపఎన్నిక‌ల్లో టీడీపీ గెలుపుకోసం కృషి చేశారు. అయిన‌ప్ప‌టికీ.. అఖిల ప్రియ.,. సుబ్బారెడ్డిని క‌లుపుకొని పోయేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. పైగా ఇటీవ‌ల జ‌రిగిన‌ భూమా ప్రథమ వర్ధంతి స‌భ‌కు కూడా ఏవీ ని పిలువలేదు. దీనిపై ఏవీ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.