అఖిల్‌ ఈ విషయంలో మాత్రం స్టార్‌ హీరో  

అక్కినేని ప్రిన్స్‌ అఖిల్‌ హీరోగా ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఏమాత్రం ఆకట్టుకోని కథతో రెండు సినిమాలు చేశాడు. అఖిల్‌ మొదటి రెండు సినిమాలు నిరాశ పర్చడంతో అక్కినేని ఫ్యాన్స్‌ స్టార్‌ హీరోగా మహేష్‌, చరణ్‌ వంటి వారికి పోటీ ఇస్తాడని భావించిన అఖిల్‌ ఇలా ఫ్లాప్‌ అవ్వడంతో నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం అఖిల్‌ తన మూడవ సినిమాను చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్‌ మూడవ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు కమర్షియల్‌గా సక్సెస్‌ను దక్కించుకోక పోయినా కూడా కమర్షియల్‌ హీరోగా మాత్రం ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది.

సహజంగా హీరోలు వరుసగా విజయాలు సాధించి, ఓ రేంజ్‌కు వెళ్లిన తర్వాత కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశాలు వస్తుంటాయి. కొందరు హీరోలు కావాలనుకున్న కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే ఛాన్స్‌లు రావు. కాని అఖిల్‌కు మాత్రం ఒక్క సినిమా కూడా చేయకుండానే ఆ అవకాశాలు దక్కాయి. ప్రముఖ బ్రాండెడ్‌ వాచ్‌కు మరియు శీతల పానియంకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం దక్కింది. వాటి ద్వారా మంచి గుర్తింపును పొందిన అఖిల్‌ సినిమాలతో మాత్రం సక్సెస్‌లను పొందలేక ఢీలా పడిపోయాడు.