వాజ్‌పేయికి నివాళి ఎందుకన్నాడు..! చివరికి చెప్పుదెబ్బలు తిన్నాడు..!     2018-08-18   12:06:40  IST  Sainath G

మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం సాయంత్రం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల బీజేపీ శ్రేణులతోపాటు దేశం మొత్తం విషాదంలో కూరుకుపోయింది. ఆయన సేవలను, ఆయన కవిత్వాలను, తలచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరని బాధపడ్డారు. కానీ మహారాష్ట్రలోని ఔరంగబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓ కార్పొరేటర్ అభ్యంతరకర రీతిలో వ్యవహరించాడు.

అటల్‌కు శ్రద్ధాంజలి ఘటించేందుకు ఔరంగబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశమవ్వగా.. ఆయనకు నివాళిని వ్యతిరేకిస్తూ ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ మతీన్ గళమెత్తాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణమేర్పడింది. ఆయన వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ బీజేపీ కార్పొరేటర్లు మతీన్‌పై భౌతిక దాడికి దిగారు. ముఖంపై పిడిగుద్దులతో పురుష కార్పొరేటర్లు విరుచుకుపడితే.. చెప్పులతో దాడి చేశారు మహిళా కార్పొరేటర్లు. ఒక పక్క మేయర్ వద్దని వారిస్తున్నా… కార్పొరేటర్లు దాడి చేస్తూనే ఉన్నారు. చివరకు పోలీసుల రాకతో బతికిబట్టకట్టాడు మతీన్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అంత గొప్పనేతను అగౌరపరిచేలా చేసిన కార్పొరేటర్ మతీన్‌కు మంచి బుద్దిచెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://youtu.be/tOc0a9DsEeI