Aicd test for Prabhas’s stamina begins

ప్రభాస్ అంటే ఇప్పుడు కేవలం ఒక తెలుగు నటుడు కాదు. దేశవ్యాప్తంగా పాపులారిటి, మార్కేట్ సంపాదించుకున్న స్టార్. బాహుబలి అనే ఒక్క సినిమా జీవితాన్ని ఎలా మార్చేసింది చూడండి. అప్పటివరకూ తెలుగు బాక్సాఫీస్ రికార్డుల్లో కూడా ప్రభాస్ పేరు కనిపించేది కాదు. అలాంటిది బాలివుడ్ ఖాన్ త్రయానికి పోటినచ్చే కలెషన్లు సాధించాడు.

కాని ఈ కలెక్షన్లో ప్రభాస్ క్రెడిట్ ఎంత అంటే, పెద్దగా ఏమి లేదు అనే తేల్చేస్తారు ట్రేడ్ పండితులు. సినిమా విజువల్ వండర్ కావడం, రాజమౌళి బ్రాండ్ పనికిరావడం వలనే బాహుబలి అన్ని వందల కోట్లు సాధించడమే కాదు, ఇప్పుడు 500 కోట్ల బిజినెస్ చేస్తోందని అభిప్రాయపడుతుంటారు ట్రేడ్ ఎక్సపర్ట్స్.

మరి నిజంగానే ప్రభాస్ మార్కేట్ ని బాహుబలి పెంచేసిందా? ఆ ఆశతోనే యూవి క్రియేషన్స్ సుజీత్ లాంటి కొత్త దర్శకుడిని పెట్టుకోని 150 కోట్లు పెట్టేస్తున్నారా? తమిళ, హిందీ భాషల్లో ప్రభాస్ కొత్త సినిమాని బాహుబలి రేంజ్ లోనే ఆదరిస్తారా ?

ప్రభాస్ కి అగ్నిపరీక్ష మొదలవుతోంది. బాహుబలి తరువాత తన సినిమా కలెక్షన్లలో ఎలాంటి అభిప్రాయభేదాలు లేకుండా క్రెడిట్ ప్రభాస్ కి దక్కుతుంది. అంటే ఫ్రభాస్ దమ్మెంతో తెలిసిపోతుందన్నమాట.