చంద్రబాబు కి తలనొప్పి తెప్పిస్తున్న బామ్మర్ది  

మళ్ళీ సీన్ రిపీట్..బామ్మర్ది అస్సలు మారడు..ఒక పక్క చంద్రబాబు ప్రతిపక్షాలు చేసే దాడులు ఎదుర్కొంటూ.. అందరికి సమాధానాలు చెప్తూ..పాలనా పరంగా ఎన్నో సమస్యలు చుట్టూ ముడుతున్నా సరే సమర్ధవంతంగా తన అనుభవంతో అన్నిటినీ సింగల్ హాండ్ పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు ఒక్క బామ్మర్ది విషయంలో తల పట్టుకున్తున్నాడు. హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ చంద్రబాబు కు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టడం టిడిపి వర్గాల్లో అసహనం పెంచుతుంది.

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో బాలయ్య మరో అభిమాని చెంప చెళ్లుమనిపించడం తో ఆదెబ్బ టిడిపికి మరోసారి తగిలింది. బాలకృష్ణ ఎవరో ఒకరిని కొడుతున్న ప్రతీసారి ఆ దెబ్బ టిడీపి పరువుమీద పడుతోంది అని ఆలోచించడం లేదు బాలయ్య. నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పుల ఘటన , ఆ తరువాత బాలయ్య కు మానసిక పరిస్థితి బాలేదని సాక్ష్యాలతో కేసు నుంచి ఆయన గట్టెక్కిన తరువాత ఎన్ బి కె కొంత కాలం సైలెంట్ గా వున్నా ఆ తరువాత ఇటీవల వైలెంట్ అయిపోతున్నారు.