త్రివిక్రమ్‌ ఫ్యాన్స్‌ కోసం రెండోసారి రాబోతున్న అరవింద సమేత..     2018-08-20   10:58:25  IST  Ramesh P

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దసరా కానుకగా విడుదల కాబోతున్న అరవింద సమేత చిత్రం టీజర్‌ను తాజాగా విడుదల చేసిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ అభిమానులను మరియు మాస్‌ ప్రేక్షకులకు విపరీతంగా అరవింద సమేత యాక్షన్‌ టీజర్‌ ఆకట్టుకుంది.

Aravinda Sametha Teaser,Jr NTR,Trivikram Srinivas

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించిన టీజర్‌ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఇది ఎన్టీఆర్‌ సినిమా అనిపించేలా టీజర్‌ ఉందని సినీ వర్గాల వారు కూడా అంటున్నారు. అయితే ఈ టీజర్‌లో త్రివిక్రమ్‌ మార్క్‌ కనిపించలేదు. అందుకే రెండవ టీజర్‌ను త్రివిక్రమ్‌ తన మార్క్‌తో విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నాడు. రెండు పంచ్‌ డైలాగ్స్‌తో పాటు హీరోయిన్‌ను చూపిస్తూ రెండవ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న అరవింద సమేత చిత్రం అంచనాలను పెంచేందుకు రెండవ టీజర్‌ మరింతగా హెల్ప్‌ అవుతుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ స్టైల్‌లో ఈ చిత్రం ఉంటుందని మొదటి నుండి ప్రచారం జరిగింది. అయితే తాజాగా వచ్చిన టీజర్‌లో ఎన్టీఆర్‌ మార్క్‌ కనిపించింది. కాని త్రివిక్రమ్‌ మార్క్‌ మాత్రం కనిపించలేదు. అందుకే త్రివిక్రమ్‌ మార్క్‌తో ఈ చిత్రాన్ని చూపించేందుకు టీజర్‌ను సిద్దం చేశారు.

Aravinda Sametha Teaser,Jr NTR,Trivikram Srinivas

జైలవకుశ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ చేస్తున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఇక ఈ చిత్రంకు ముందు అజ్ఞాతవాసి చిత్రంతో ఫ్లాప్‌ అయిన త్రివిక్రమ్‌కు ఈ చిత్రం చాలా ముఖ్యం. ఆ చిత్రం ఫలితం కారణంగా మూడు నెలల గ్యాప్‌ తీసుకుని ఈ చిత్రం స్క్రిప్ట్‌ను మరింత పర్‌ఫెక్ట్‌గా తయారు చేయడం జరిగింది. అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఇదో బ్లాక్‌ బస్టర్‌ కావడం ఖాయం అంటున్నారు.