అదితిరావు మరో రకుల్‌ కానుందా?     2018-06-16   00:45:54  IST  Raghu V

సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం, ఎప్పుడు ఎలాంటి రంగు ఉంటుందో అర్థం కాదు. నేడు చిన్న హీరోయిన్‌గా ఉన్న వారు రేపటికి స్టార్స్‌ అవ్వొచ్చు, నేడు స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న వారు రేపటికి అవకాశాలు లేక బిక్క మొహం వేసుకున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి. ఇక విషయానికి వస్తే రెండు సంవత్సరాల క్రితం ‘చెలియా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అదితిరావు ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. ఇతర భాషల్లో అడపా దడపా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సమ్మోహనం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నటిగా అదితి రావు మరోసారి ఆకట్టుకుంది. ‘చెలియా’ చిత్రంలో ఈ అమ్మడి నటన బాగున్నా కూడా నిర్మాత మరియు దర్శకుల దృష్టిలో పడలేదు. కాని ఈసారి మాత్రం ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. సమ్మోహనం చిత్రంలో ఒక స్టార్‌ హీరోయిన్‌ పాత్రను ఈమె పోషించింది. ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసిందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఫీలింగ్స్‌ను చక్కగా కనబర్చి అద్బుతమైన ప్రతిభతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ అదితి రావుకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది. ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం ఆసక్తిగా ఉన్నారు.