అందాల ఆరబోత ఎంత ఉన్నా, అవకాశాలు మాత్రం సున్న     2017-10-17   03:28:57  IST  Raghu V

Adah Sharma goes bold for offers?

నటన సంగతి ఏమో కాని గ్లామర్ మాత్రమే కౌంట్ చేస్తే అదాశర్మ ఏ టాలివుడ్ టాప్ హీరోయిన్ కి తక్కువ కాదు‌. ఆకర్షణీయమైన స్కిన్ టోన్, అందమైన నవ్వు, ఇక మిగితా హీరోయిన్లు అసూయపడదగ్గ ఫిగర్ అదా సొంతం. ఇటు లావుగానూ ఉండదు, అటు పూర్తి స్కిన్నీగానూ ఉండదు‌‌. అందాల ఆస్తి ఉన్నా, అవకాశాలే లేవు.

మొదటి చిత్రం హార్ట్ ఎటాక్ తోనే చూపరులని ఆకట్టుకుంది అదా. అందుకే వెంటవెంటనే అవకాశాలు తలుపుతట్టాయి. కాని సక్సెస్ లేకపోయే సరికి ఈమెవైపు చూడ్డమే మానేసారు. ఆమధ్య క్షణం లాంటి సూపర్ సక్సెస్ దొరికినా, అందులో అదా పెర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కినా, అవకాశాలు మాత్రం ఊపందుకోలేదు. ఇటు తమిళంలో చేసిన ప్రయత్నాలు, అటు బాలివుడ్ లో చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి.

ఇప్పుడు అదా చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేదు. హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తోంది, పబ్లిక్ ఫంక్షన్ లో చిట్టిపొట్టి బట్టల్లో దర్శనమిస్తోంది. అయినా లాభం లేకుండాపోయింది.

నిన్న అదా ఏయిర్ పోర్ట్ లో కూడా ఇలా హాట్ హాట్ గా మీడియాకి చిక్కింది. మీడియావారు తన మీద మ్యాటర్ రాస్తారో లేదో అనుకుందో ఏమో, ఫోటోలు పాపులర్ అయ్యేలా తాను కూడా పోస్టులు పెట్టింది‌. మరి గ్లామరస్ స్టంట్ ఏమైనా అవకాశాలు తెచ్చిపెడతాయో చూడాలి.