Actress Sanjjannaa’s nude video leaked

న్యూడిటి అనేది ఇంకా భారతీయ సినిమాలోకి చొచ్చుకుపోలేదు. ఎప్పుడో ఓసారి, అడపాదడపా ఎదో ఒకటి రెండు సినిమాల్లో రాధిక ఆప్టే, షెర్లిన్ చోప్రా, పాఓలి డామ్ లాంటి హీరోయిన్లు నగ్నంగా కనిపించారు. ఈ లిస్టుకి మహాఅయితే మరో నాలుగైదు పేర్లు కలపొచ్చు ఏమో. ఇప్పుడు ఈ అరుదైన క్లబ్ లోకి చేరింది సంజనా గర్లాని. అదేనండి .. ప్రభాస్ బుజ్జిగాడులో కనిపించింది కదా, ఆ హీరోయిన్. ఈ నటి కొత్తగా నటించిన సినిమా దండుపాల్యం 2. ఈ పేరు అల్రేడి విన్నారు కదా. అవును, మొదటి భాగం దండుపాల్యం తెలుగులో బాగానే ఆడింది. దీనికి సీక్వెల్ గా వచ్చిన దండుపాల్యం 2 కర్ణాటకలో భారీ వసూళ్లను రాబడుతోంది. దీని తెలుగు వెర్షన్ శుక్రవారం విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక విడియో క్లీప్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తోంది. దాంట్లో హీరోయిన్ సంజనా నగ్నంగా ఉండటం విశేషం. సినిమా లో ఉండాల్సిన ఈ సీన్ సెన్సార్ కత్తెరకు గురయ్యింది. సహజత్వం కోసం న్యూడ్ గా తీసినా, ఇండియన్ ఆడియెన్స్ కోసం బ్లర్ చేసారు. అయితే ఈ సన్నివేశం శృంగారభరితంగా ఉండదు. హింసాత్మకంగా ఉంటుంది. సంజనాని రాళ్ళతో కొడుతుంటారు. న్యూడిటి, హింస, రెండూ ఉండటం వలన ఏమో … డిలీట్ చేసారు. అయితే అనుకోకుండా ఇంటర్నెట్ లోకి లీక్ అయ్యింది.

ఈ సినిమా సీన్లు లీక్ అవడం ఇదేమి కొత్త కాదు. ఇంతకుముందు సినిమాలోని ఒక లెస్బియన్ కిస్ సన్నివేశం కూడా లీక్ అయ్యింది. ఇలా వివాదాస్పదమైన సన్నివేశాలే లీక్ అవుతున్నాయి అంటే, బహుషా పబ్లిసిటి కోసం స్వయంగా యూనిట్ వారే లీక్ చేస్తున్నారేమో.