టాప్ లెస్ సీన్ లో నటిస్తే...పోర్న్ స్టార్ అనేస్తారు.? అంటూ ఫైర్ అవుతున్న నటి.!  

ఈ మధ్య వెబ్ సిరీస్ లు చాలా ఊపందుకున్నాయి. అందులో అడల్ట్ కంటెంట్ కూడా శృతి మించుతుంది. సెన్సార్ లేకపోవడంతో ఇష్టారాజ్యం అయిపొయింది. కానీ చివరికి వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రస్తుతం ‘సాక్రెడ్ గేమ్స్’ అనే వెబ్ సిరీస్ కూడా అలాగే వివాదంగా మారింది. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా నటించిన నవాజుద్దీన్‌కు భార్య సుభద్రగా రాజశ్రీ నటించింది. నవాజుద్దీన్‌తో శృంగారం చేసే సన్నివేశంలో ఆమె పైదుస్తులు విప్పి బోల్డ్‌గా కనిపించారు. ఈ వీడియో ఇప్పుడు పోర్న్ వెబ్‌సైట్లో చక్కెర్లు కొడుతోంది.

ఈ సీన్ చూసిన కొందరు ఆమెను పోర్న్ స్టార్ అని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఈ కామెంట్స్పై ఆమె విరుచుకుపడింది. ‘‘టాప్‌లెస్ సీన్ చేస్తున్నప్పుడు నాకు అసౌకర్యంగా అనిపించలేదు. పైగా, అక్కడ నిజంగా సెక్స్ చేయలేదు. అది ఆ చిత్రానికి అవసరమైన సన్నివేశం మాత్రమే. కెమేరా ముందు బ్లౌజ్ ఒపెన్ చేయడమంటే నాకు కష్టమైన పనే. కానీ.. చేశాను. అయితే, అవి సోషల్ మీడియా, వాట్సాప్‌లలో చక్కర్లు కొడతాయని ఊహించలేదు. పైగా ఆ సీన్లు పోర్న్ సైట్లలో కూడా చక్కర్లు కొడుతున్నాయని తెలిసింది. పోర్న్ స్టార్ అంటూ నాకు మెసేజులు కూడా వస్తున్నాయి’’ అని పేర్కొంది.

పైగా ఈ చిత్రంలో దివంగత ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీపై అభ్యంతకర సన్నివేశాలు ఉండటంతో మరింత వివాదాస్పదంగా మారింది. . ఈ వెబ్‌ సిరీస్‌లో అశ్లీలత, అసభ్యత ఎక్కువగా ఉందంటూ సెన్సార్‌ బోర్డుకు పలు ఫిర్యాదులు కూడా అందాయి.