అప్పట్లో గెస్ట్‌హౌస్‌కు పిలిచేవారు ఆమని సంచలన వ్యాఖ్యలు     2018-07-03   00:17:53  IST  Raghu V

తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఎంతో మంది హీరోయిన్స్‌ కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడారు. ఎక్కువ శాతం మంది అవకాశాలు దక్కించుకోవాలంటే కొన్ని సార్లు లైంగిక వేదింపులకు గురి కాక తప్పదని, ఆ వేదింపులను ఆనందంతో స్వీకరించినప్పుడు మాత్రమే తెలుగు సినిమా పరిశ్రమలో నెగ్గుకు రాగలం అంటూ వ్యాఖ్యలు చేశారు. మరి కొందరు మాత్రం అసలు సినిమా ఇండస్ట్రీలో అలాంటిది లేదని, సినిమాల్లో ఒక్కసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రతిభ ఆధారంగా అవకాశాలు వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఇండస్ట్రీలో ఉందని చెప్పుకోవచ్చు.

ఈమద్య కాలంలోనే కాకుండా రెండు మూడు దశాద్దాల క్రితం కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉండేదంటూ సీనియర్‌ హీరోయిన్స్‌ కూడా అంటున్నారు. గత కొంత కాలంగా జరుగుతున్న చర్చలు ఈ విషయంపై అందరి దృష్టి పడేలా చేస్తుంది. తాజాగా సీనియర్‌ హీరోయిన్‌, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టు అయిన ఆమని ఈ విషయంపై స్పందించింది. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడిన ఆమని అప్పట్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉండేదని, అమాయకపు అమ్మాయిలను లోబర్చుకునే వారు అంటూ వ్యాఖ్యలు చేసింది.