Actor Nikhil in affair with this heroine?

వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు నిఖిల్. మధ్యమధ్యలో తను చేసే ప్రయత్నాలు బెడిసికొడుతున్నా, ప్రయోగాలు మాత్రం ఆపకుండా ప్రేక్చకులకి కొత్తరకం సినిమాలని అందిస్తూ నిర్మాతలకి బ్యాంకబుల్ హీరోగా మారాడు నిఖిల్. అయితే 32 ఏళ్ళ నిఖిల్ ఇంతవరకు పెళ్ళి చేసుకోలేదు. హ్యాపి డేస్ నుంచి కేశవ దాకా, నిఖిల్ పేరు కనీసం తన హీరోయిన్లతో లింక్ అవడం కూడా చూడలేదు మనం. కాని మొదటిసారి నిఖిల్ పేరు ఓ హీరోయిన్ తో వినబడుతోంది.

స్వాతి రెడ్డి తెలుసుగా. అష్టాచెమ్మతో తెలుగు తెరకి పరిచయమై, నిఖిల్ తో స్వామిరారా, కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్లలో నటించిన స్వాతి ఈమధ్య నిఖిల్ కి బాగా క్లోజ్ అయ్యిందట. ఇదే నెలలో జరిగిన నిఖిల్ బర్త్ డే కూడా స్వాతి ఉండగా జరిగింది. ఇద్దరు ప్రైవేటుగా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారట. ఆ తరువాత కూడా వీరు కలిసి కనిపించటంతో వీరి మధ్య ఏదో జరుగుతోందనే డౌటు ఇంకా పెరిగిపోయింది.

నిఖిల్ ఏమో, తల్లి చూపించిన అమ్మాయినే చేసుకుంటానని అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. స్వాతి ఎలాగో నిఖిల్ తల్లి చూసిన అమ్మాయి కాదు కాని, ఆవిడ ఈ జంటకి పెళ్ళి పర్మీషన్ ఇస్తుందో లేదో చూడాలి.

ఇక కెరీర్ గురించి మాట్లాడితే నిఖిల్ చేతిలో ఓ నాలుగు సినిమాలు ఉన్నాయి. స్వాతి తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.