వెంకీ తలనొప్పిని నాని ఎత్తుకున్నాడా?     2018-06-21   03:05:32  IST  Raghu V

నాని వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా మినిమం సక్సెస్‌గా చిత్రాలు చేసుకుంటూ దూసుకు పోతున్న నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది. మరో వైపు బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను హోస్ట్‌ చేస్తున్నాడు. తాజాగా గౌతమ్‌ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రాలు మాత్రమే కాకుండా మారుతి దర్శకత్వంలో మరోసారి నాని ఒక చిత్రంను చేయబోతున్నాడు. అప్పుడే ఆ సినిమాకు ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం కథ వెంకీ కోసం మారుతి రాసుకున్నట్లుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్‌ కోసం కొన్నాళ్ల క్రితం దర్శకుడు మారుతి ‘రాధా’ అనే చిత్రంకు స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు. మారుతి దర్శకత్వంలో అనుకున్న ఆ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాలని భావించారు. ఒక హోం మంత్రి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, ఆయన రాజకీయ వ్యవస్థను తనకు తగ్గట్లుగా, తన ఆలోచనలకు తగ్గట్లుగా ఎలా మల్చుకున్నాడు అనే విషయాన్ని మారుతి వెంకీతో చూపించాలని భావించాడు. కాని కథ వివాదాస్పదం అవ్వడంతో సినిమా షూటింగ్‌ ప్రారంభం కాగానే వాయిదా వేయడం జరిగింది. మారుతి దర్శకత్వంలో సినిమాను వెంకీ వదుకోగా, దాన్నే ఇప్పుడు నాని నెత్తికి ఎత్తుకుంటున్నట్లుగా తెలుస్తోంది.