AC లో ఎక్కువగా గడుపుతున్నారా? అయితే ఇది మీ కోసమే    2018-06-03   23:43:36  IST  Lakshmi P

వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. ప్రతి ఒక్కరు ఎండలో బయటకు రాకుండా AC గదుల్లో గడిపేస్తున్నారు. అయితే ఆలా ఎక్కువగా AC లో గడపటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

AC లో ఎక్కువగా గడిపేవారికి చర్మం పొడిగా మారుతుంది. AC లో కూర్చొని ఒక్కసారిగా ఎండలోకి వెళ్ళితే ఈ సమస్య బాగా పెరుగుతుంది. పొడి చర్మ తత్త్వం కలవారైతే ఈ సమస్య ఎక్కువ అవుతుంది.