ABN Radha Krishna Showing interest on Rajya Sabha seat.

ఏపీలో అధికార టీడీపీ అధికారంలోకి వ‌చ్చిందో లేదో ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ ఆ పార్టీ డ‌ప్పేయ‌డంలో విశ్వ‌రూపం చూపించేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు చాలా ఓపెన్‌గానే జ‌రుగుతున్నాయి. అధికార టీడీపీ మీద రాధాకృష్ణ ఈగ వాల‌నీయ‌డం లేదని ఆయ‌న మీడియాలో వ‌స్తోన్న వార్త‌లే చెపుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఏపీ, తెలంగాణ‌లో కేవ‌లం 5 ల‌క్ష‌ల స‌ర్యులేష‌న్ ఉన్న ఆంధ్ర‌జ్యోతి తెలుగుదేశం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అద‌న‌పు హంగులు ఎన్నో సంత‌రించుకుంది.

ఈ ప‌త్రిక స‌ర్యులేష‌న్ ఇప్పుడు ఏకంగా 8.50 ల‌క్ష‌లు దాటేసి 9 ల‌క్ష‌ల‌ను క్రాస్ చేసేదిశ‌గా దూసుకెళుతోంది. ఏపీలో చాలా చోట్ల నిన్న‌టి వ‌ర‌కు జ్యోతికి సొంత కార్యాల‌యాలు లేవు. ఇప్పుడు చాలా జిల్లాల్లో కొత కార్యాల‌యాల నిర్మాణం శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. వీట‌న్నింటి వెన‌క టీడీపీ అండ‌దండ‌లు, చంద్ర‌బాబు స‌హాయ స‌హ‌కారాలు ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వ‌మే అని ఓ టాక్‌.