Aamir Khan making Rajamouli nervous with Dangal China run

బాహుబలి – ది బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా 640-650 కోట్ల గ్రాస్ వసూళ్ళు చేసింది. అప్పటికి ఇది పీకే తరువాత హయ్యెస్ట్ కలెక్షన్. ఆ రకంగా ఆలిండియా ఇండస్ట్రీని అడ్డుకున్నాడు ఆమీర్ ఖాన్. అయితే పీకేని ఇండియాలో మాత్రం దాటేసింది బాహుబలి. ఆ తరువాత దంగల్ తో వచ్చిన ఆమీర్ బాహుబలి 1 ఇండియా గ్రాస్ వసూళ్ళని నెం.1 స్థానంలో నిలిపి మళ్ళీ తన రికార్డులు వెనక్కి తీసుకున్నాడు.

ఇప్పుడు బాహుబలి 2 అన్ని రికార్డులని తుడిచిపెట్టేసింది. ఇండియాలో దీని రికార్డులని అందుకోవడం ఇప్పట్లో జరిగే పని కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల వసూళ్ళు సాధించిన తొలి భారతీయ సినిమాగా నిలిచినా, ఆ అనందం ఎక్కువకాలం నిలవకుండా చేసాడు ఆమీర్. దంగల్ మే 5వ తేదిన చైనాలో విడుదల అయ్యింది. 730-740 కోట్ల మధ్య ఉన్న దంగల్ వసూళ్ళు కాస్త 1000 కోట్లు మార్కుని దాటాయి. అసలు ఎవరు ఊహించని విధంగా దంగల్ ఇప్పటివరకు చైనాలో 400 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టుకోని 1200 కోట్లకి అతి చేరువలో ఉంది. దాంతో బాహుబలి 2కి దంగల్ కి మధ్య వ్యత్యాసం రాను రాను తగ్గిపోతోంది. ప్రస్తుతం రెండిటి మధ్య 150-180 కోట్ల తేడా మాత్రమే ఉంది.

మరోవైపు చైనాలో దంగల్ ప్రభంజనం ఇక్కడితో ఆగేలా లేదు. కేవలం చైనా నుంచి 600-650 కోట్లకి పైగా రావడం ఖాయమని చెబుతున్నారు ట్రెడ్ విశ్లేకులు. బాహుబలి ఇదే స్పీడు చూపించి 1600 కోట్లకి పైగా వసూళ్ళు సాధిస్తే ఫర్వాలేదు కాని, లేదంటే రాజమౌళి ఆలిండియా ఇండస్ట్రీ హిట్ ని మరోసారి అడ్డుకుంటాడు ఆమీర్. ఇప్పుడు రాజమౌళి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ రికార్డు కూడా ఆమీర్ ఖాన్ ఉన్నంతవరకు సురక్షితం కాదు.