పవన్ - మహేష్ ఫ్యాన్స్ చేయలేని పని ఈ హీరో ఫ్యాన్స్ చేసారు

ఓ వ్యక్తీ పవన్ కళ్యాణ్ బాలివుడ్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేయడానికి కూడా పనికి రాడు అన్నాడు. పవన్ చూడ్డానికి జోకర్ లా ఉంటాడు, వేస్తె గీస్తే కామేడియన్ వేషాలు వేయాలి కాని అసలు సౌత్ లో హీరోగా ఎలా చూస్తున్నారు అంటూ ఎద్దేవా చేసాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో పంపినిదారులు చేసిన గొడవలు జాతీయవ్యాప్తంగా తెలిసేలా చేసాడు. కేవలం పవన్ నే టార్గెట్ చేయలేదు. మహేష్ బాబు ఎంత అందంగా ఉన్నా, ఓ హీరోయిన్ ని చూస్తున్నట్లు కనిపిస్తాడు, దక్షిణాదివారు అతనంటే పడిచస్తారేమో, నేను మాత్రం ఎప్పటికి ఫ్యాన్ కాలేను అంటూ అవమానించాడు.

ఇంత రచ్చ చేసినా, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు, అటు మహేష్ బాబు అభిమానులు ఏమి చేయలేకపోయారు. ఎదో సోషల్ మీడియాలో బండబూతులు తిట్టడం తప్ప ఇంకేమి చేయలేదు. దాంతో అతడు మోహన్ లాల్, అల్లు అర్జున్, సమంత, ధనుష్ .. ఇలా చెప్పుకుంటూపొతే చాలామంది దక్షిణాది సినిమాతారల్ని అవమానించాడు. అతనెవరో మీకు ఇప్పటికే గుర్తుకు వచ్చే ఉంటుంది. అవును, మేం మాట్లాడుతున్నాది బాలివుడ్ వివాదాస్పద క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కీ) గురించి.

,